శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 21, 2021 , 21:13:34

కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ముందే రిలీజ్ కానుందా..!

కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ముందే రిలీజ్ కానుందా..!

కేజీఎఫ్ చాప్ట‌ర్ 2...దేశ‌వ్యాప్తంగా సినీ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా..? అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు. ఇటీవ‌లే య‌శ్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా విడుద‌లైన టీజ‌ర్ కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు. హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై ప్ర‌శాంత్‌నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 జూన్ 30న విడుద‌ల కానుంద‌ని ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్ లో ఇప్ప‌టివ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి. అయితే దీనికి సంబంధించిన అప్‌డేట్ మ‌రొక‌టి సినీ ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఈ మూవీ జూన్ 30న కాకుండా మే 30న (నెల ముందుగానే) స‌మ్మ‌ర్ కానుకగా విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ చిత్రంలో ర‌వీనాటాండ‌న్‌, రావు ర‌మేశ్‌, సంజ‌య్‌ద‌త్‌, కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సంజ‌య్ ద‌త్ అధీరాలుక్ లో గ‌తంలో ఎన్న‌డూ క‌నిపించ‌ని విధంగా స‌రికొత్తగా క‌నిపిస్తూ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తున్నాడు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

మ‌హేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

చిరంజీవి ఆ రీమేక్ ను ప‌క్క‌న పెట్టాడా..?

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుల క‌హానీ ఏంటి?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo