సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Aug 04, 2020 , 23:46:12

యాక్షన్‌కు సిద్ధం

యాక్షన్‌కు సిద్ధం

కరోనా వైరస్‌ ప్రభావంతో గత ఐదారు నెలలుగా సినిమా చిత్రీకరణలు నిలిచిపోయాయి. స్వీయజాగ్రత్తలతో పాటు ప్రభుత్వం సూచించిన నియమనిబంధనలను పాటిస్తూ తక్కువ మంది యూనిట్‌ సభ్యులతో షూటింగ్‌లు చేసేందుకు కొందరు దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు. యష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘కేజీఎఫ్‌-2’ సినిమా చిత్రీకరణను ఈ నెల 15 నుంచి పునఃప్రారంభించబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. బెంగళూరు సమీపంలోని మినర్వామిల్స్‌లో వేసిన భారీ సెట్‌లో కీలకమైన యాక్షన్‌ సన్నివేశాల్ని చిత్రీకరించబోతున్నట్లు పేర్కొన్నారు.  ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా షూటింగ్‌ను జరిపేందుకు  ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. ఈ యాక్షన్‌ సన్నివేశాలు మినహా మిగిలిన షూటింగ్‌ మొత్తం పూర్తయినట్లు తెలిపారు.  తొలుత దసరా కానుకగా ఆక్టోబర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. కరోనా ప్రభావం వల్ల చిత్రీకరణ ఆలస్యమవడంతో   సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్‌, రవీనాటాండన్‌ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.


logo