కేజీఎఫ్ 2 టీజర్ విడుదలై దాదాపు ఏడు నెలలు అవుతుంది. ఈ ఏడు నెలల్లో ఎన్నో సంచలనాలు సృష్టించింది ఈ టీజర్. మరే హీరోకు సాధ్యం కాని స్థాయిలో రికార్డుల వర్షం కురిపించింది. ఇండియన్ సినిమా రేంజ్ ఇది అంటూ దూసుకుపోతుంది కేజీఎఫ్ 2 టీజర్. యష్ హీరోగా నటిస్తున్న కేజీఎఫ్ 2 టీజర్ జనవరి 7 రాత్రి విడుదలైంది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ సినిమా ఇదే. కేజిఎఫ్ చాప్టర్ 2 టీజర్ యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అప్పట్లో విడుదలైన 48 గంటల్లోపే ఈ చిత్రం 100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. అంతేకాదు 5.5 మిలియన్స్ కు పైగా లైకులు కూడా సంపాదించింది. ఇక ఇప్పుడు ఈ టీజర్ 200 మిలియన్ల మార్క్ అందుకుంది. అంటే 20 కోట్ల మంది టీజర్ ను చూశారు. అంతేకాదు 8.4 మిలియన్ల మంది లైక్ చేయగా.. 11 లక్షల కామెంట్లు వచ్చాయి. ఇది కూడా ఒక రికార్డే. 100 కోట్ల ఇంప్రెషన్స్ వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో #KGF2Teaser200MViews పేరిట సందడి చేస్తున్నారు యష్ అభిమానులు.
2 నిమిషాల 16 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ చూస్తుంటే చాప్టర్-2 ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. తొలి భాగానికి 10 రెట్లు అదిరిపోయేలా చాప్టర్ 2 తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇదిలా ఉంటే విడుదలైన క్షణం నుంచి ఈ ట్రైలర్ చరిత్ర సృష్టిస్తోంది. నిజానికి జనవరి 8 ఉదయం 10 గంటల 18 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనౌన్స్ చేశారు. కానీ ముందు రోజు రాత్రి ట్రైలర్ లీక్ అయింది. దాంతో జనవరి 7 రాత్రి ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. కొన్ని ప్యాచ్ వర్క్స్ మినహా సినిమా అంతా అయిపోవడంతో విడుదల తేదీ ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు. అన్ని కుదిరితే డిసెంబర్ 24న క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని చూస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కేజీఎఫ్ 2 ఒకేరోజు విడుదల కానుంది. ఈ సినిమా దాదాపు 230 కోట్ల బిజినెస్ చేస్తుంది. తెలుగులో కూడా దాదాపు 70 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. హిందీలో కూడా ఈ సినిమాకు అద్భుతమైన బిజినెస్ జరుగుతుంది. అన్ని ఇండస్ట్రీల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తెలుగు ఇండస్ట్రీకి మరో తమిళ హీరో.. 20 కోట్ల రెమ్యునరేషన్
Tollywood : అందరి దృష్టి టాలీవుడ్‌పైనే.. ఒక ఛాన్స్ అంటున్న ఇతర భాషల హీరోలు
థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లో రాశీఖన్నా..?
Bigg boss | బిగ్ బాస్ అప్డేట్.. కంటెస్టెంట్స్ వీళ్ళేనా ?
ఒకే ఒక్కడు రేంజ్లో చరణ్-శంకర్ మూవీ..!
ప్రకాశ్ రాజ్‌కు విజన్ ఉంది,అందుకే సపోర్ట్ చేస్తున్నాను: నాగబాబు