కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్. ఈ చిత్రానికి కొనసాగింపుగా యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జూలైలో చిత్రం విడుదల కావలసి ఉండగా, కరోనా వలన వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. మొదటి పార్ట్ కన్నా కూడా భారీ బడ్జెట్‌తో రెండో పార్ట్ తెరకెక్కిస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్ కూడా ఇందులో ఎక్కువే. సంజయ్ దత్ విలన్ ‘అధీరా’ పాత్రలో కనిపించనుండగా, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్., ఈశ్వరీ రావు, రావు రమేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
గత కొద్ది రోజులుగా సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న వారి ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తున్న మేకర్స్ తాజాగా విలక్షణ నటుడు రావురమేష్ లుక్ విడుదల చేశారు. సీబీఐ ఆఫీసర్ కన్నెగంటి రాఘవన్గా రావు రమేష్ పాత్ర ఆకట్టుకునేలా ఉంది. ‘నరాచి లైమ్ స్టోన్ కార్పొరేషన్ వెనుక దాగున్న నిజాన్ని బయట పెట్టడంలో రాఘవన్ విజయవంతం అవుతారా?’ ‘సిబిఐకి ఉన్న ఆసక్తి కేజీఎఫ్ మీదనా లేదా రాకీ భాయ్ మీదా?’ అనేది సినిమా చూస్తేనే తెలుస్తుందని అంటున్నారు మేకర్స్. హోంబలే ఫిలింస్ బేనర్‌పై సినిమా నిర్మితమవుతుంది.