ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్‌గా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 1.ఇప్పుడు దానికి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్-2 వస్తుండటంతో అందరి చూపు ఈ చిత్ర రిలీజ్ డేట్‌పై పడింది. జూలై 16 చిత్రాన్ని విడుదల చేయనున్నామని ఫస్ట్ లాక్డౌన్ తర్వాత మేకర్స్ ప్రకటించారు. కాని కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తర్వాత మళ్లీ పరిస్థితులు మారాయి. థియేటర్స్ మూతపడడంతో ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి.
ఒకవేళ అన్నీ కరెక్ట్ గా ఉంటే ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ని ఈరోజు థియేటర్స్ లో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్లు. కాని కరోనా సంక్రమణ చెందుతున్న నేపథ్యంలో కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు మేకర్స్. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఓవర్ హైప్ తో వస్తుండగా, చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్నారు. చిత్రంలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. సంజయ్ దత్ విలన్‌గా నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ కీలక పాత్ర పోషిస్తోంది.