శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 30, 2020 , 17:33:16

అప్పుడు సుశాంత్ ద‌గ్గ‌ర‌..ఇపుడు సారా ఇంట్లో కేశ‌వ్‌..!

అప్పుడు సుశాంత్ ద‌గ్గ‌ర‌..ఇపుడు సారా ఇంట్లో కేశ‌వ్‌..!

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 2020 జూన్ 14న బాంద్రాలోని త‌న నివాసంలో అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. సుశాంత్ మృతిపై కేసు న‌మోదు చేసిన అధికారులు అన్ని కోణాల్లో విచార‌ణ కొనసాగిస్తున్నారు. ఇప్ప‌టికే సుశాంత్ ఫ్లాట్ లో ఉన్న సిద్దార్థ్ పితానీతోపాటు ఫ్లాట్ లో ప‌నిచేసిన నీర‌జ్, కేశ‌వ్ స‌హా ఇత‌రుల‌కు స‌మ‌న్లు జారీచేసి సీబీఐ అధికారులు విచార‌ణ జ‌రిపారు. విచార‌ణ కొన‌సాగుతుండ‌గా డ్ర‌గ్స్ లింక్స్ బ‌య‌ట ప‌డుతుండ‌టంతో రియాచ‌క్ర‌వ‌ర్తిని అదుపులోకి తీసుకున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ప‌లువురు హీరోయిన్ల‌కు స‌మ‌న్లు జారీచేసి విచారిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా సుశాంత్ ద‌గ్గ‌ర ప‌నిచేసిన కేశవ్ స‌డెన్ గా లైమ్ లైట్ లోకి వ‌చ్చాడు. ఇటీవ‌లే సారా అలీఖాన్ ఇంటి ద‌గ్గ‌ర కేశ‌వ్ క‌నిపించ‌డ‌మే ఇందుకు కార‌ణం. సుశాంత్ చ‌నిపోయిన రోజు బాంద్రా అపార్టుమెంట్ ద‌గ్గ‌ర ఉన్న వారిలో కేశవ్ కూడా ఒక‌డు. ఇటీవ‌లే ఎన్సీబీ విచారణ నేప‌థ్యంలో గోవాలో ఉన్న సారా అలీఖాన్ ముంబైకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇదే స‌మ‌యంలో సారా ఇంట్లో కేశవ్ క‌నిపించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

సుశాంత్ ఇంట్లో ప‌నిచేసిన వారిలో ఒక‌డైన నీర‌జ్ సింగ్ అంకుల్ చెప్పిన ప్ర‌కారం..కేశవ్ ప్ర‌స్తుతం సారా అలీఖాన్ ఇంట్లో ప‌నిచేస్తున్నాడు. ఇటీవ‌లే గోవా వెళ్లిన కేశ‌వ్ 2 రోజుల క్రిత‌మే..సారా పిలిచిన వెంట‌నే ముంబైకి తిరిగొచ్చాడు. మ‌రోవైపు సారా కూడా ఇటీవ‌ల‌ గోవా నుంచి తిరిగివ‌చ్చింది. అయితే సుశాంత్ కేసు విచార‌ణ‌లో భాగంగా అధికారులు కేశ‌వ్ ను కూడా ఫోన్ లో సంప్ర‌దించార‌ట‌. త‌నను ఒంటరిగా ఉండనివ్వాల‌ని, ప్ర‌స్తుతానికి త‌న‌ను ఈ విచార‌ణ‌లోకి లాగొద్ద‌ని అధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేశాడ‌ట కేశ‌వ్‌. మ‌రి అధికారులు రాబోయే కాలంలో కేశ‌వ్ ను విచారిస్తారా..? లేదా ? అన్న‌ది చూడాలి. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.