మహానటితో తెలుగు ఆడియన్స్‌కి చాలా దగ్గరైన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ప్రస్తుతం ఇతర భాషలలోను మంచి ఆఫర్స్ అందుకుంటుంది. వరస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడూ ఫోటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. ఈ మధ్య యోగాసనాలకు సంబంధించిన క్యూట్ పోజులు ఇస్తూ మతులు చెడగొడుతుంది కీర్తి సురేష్.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన కీర్తి సురేష్ యోగసనాలు చేస్తూ టెన్షన్ తగ్గించుకుంటుంది. కీర్తి ఆసనాలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ ,“మరక్కార్ ” అనే మలయాళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “అన్నాత్తే” , “సాని కాయిదం “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.