ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 00:32:36

కాస్త బరువు పెరగండి!

కాస్త బరువు పెరగండి!

చక్కనమ్మ చిక్కితేనే అందమంటారు. సన్నజాజి తీగలా నాజూకు సోయగంతో వెలిగిపోవాలని నేటితరం భామలు తపిస్తుంటారు. ఇక చిత్రసీమలో కథానాయికలైతే స్లిమ్‌గా ఉండటం తప్పనిసరి అనుకుంటారు. అందుకోసం రకరకాల కసరత్తులు చేస్తుంటారు. అయితే సైజ్‌జీరో మంత్రం అందరికి వర్తించదు. కొందరు నాయికలు తమ సహజఆకృతిలోనే బాగుంటారు. అలాంటివారిలో మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ ఒకరు. కెరీర్‌ ఆరంభం నుంచి కాస్త బొద్దుగా కనిపించే ఈ భామ అదే రూపలావణ్యంతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవలకాలంలో ఆమె బాగా సన్నబడింది. ఓనమ్‌ వేడుకల సందర్భంగా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటోల్లో స్లిమ్‌గా కనిపించింది. తాజా ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో కీర్తిసురేష్‌ మునుపటి కంటే మరింత సన్నబడి కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.  ఓ సినిమా షూటింగ్‌ విరామంలో తీసుకున్న ఈ వీడియోలో కీర్తి సురేష్‌ పూర్తిగా చిక్కిపోయి కనిపిస్తోంది. వీడియో చూసిన మెజారిటీ అభిమానులు ‘కాస్త బరువు పెరిగితేనే మీరు బాగుంటారు.  స్లిమ్‌లుక్‌ మీకు సూట్‌ కాలేదు’ ‘కొంచెం ఒళ్లు పెంచండి ప్లీజ్‌' అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. పోస్ట్‌ చేసిన కొద్ది సమయంలోనే దాదాపు పదిలక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ప్రస్తుతం కీర్తి సురేష్‌ త తెలుగులో ‘రంగ్‌దే’ చిత్రంలో నితిన్‌ సరసన కథానాయికగా   నటిస్తోంది.logo