సోమవారం 25 మే 2020
Cinema - Apr 04, 2020 , 11:56:50

ఈ ఏడాది చివ‌ర‌లో పెళ్ళి పీట‌లెక్క‌నున్న కీర్తి సురేష్‌..!

ఈ ఏడాది చివ‌ర‌లో పెళ్ళి పీట‌లెక్క‌నున్న కీర్తి సురేష్‌..!

నేను శైల‌జ చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ప్రేక్ష‌కుల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర‌వేసుకుంది. ఇటీవ‌ల సావిత్రి జీవిత‌మాధారంగా తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రంలో పూర్తి న‌ట‌నా నైపుణ్య‌త ప్ర‌ద‌ర్శించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. మ‌హాన‌టి చిత్రానికి గాను కీర్తి సురేష్   జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్నారు.

తాజాగా కీర్తి సురేష్ పెళ్ళికి సంబంధించిన సంబంధించిన వార్త ఫిలిం స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. కీర్తి సురేష్ కోసం ఆమె కుటుంబ స‌భ్యులు ఇప్ప‌టికే ఓ వ‌రుడిని వెతికార‌ని ,అత‌ను ప్ర‌ముఖ బీజేపీ నాయకుడి కుమారుడని స‌మాచారం. ఈ ఏడాది చివ‌ర‌లో వారిద్ద‌రి వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు  నటుడు ఫూల్‌వాన్‌ రంగనాథన్‌ ఒక  మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అయితే కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. 

ప్ర‌స్తుతం  తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తి,  ప్రముఖ దర్శకుడు కుకునూర్‌ నగేశ్‌ తొలిసారి తెలుగులో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలో  నటిస్తున్నారు. 'గుడ్‌ లక్‌ సఖి' అనే పేరుతో రూపొందుతున్న‌ ఈ సినిమాలో కీర్తి డీ- గ్లామర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇక తెలుగులో మిస్ ఇండియా, రంగ్ దే చిత్రాలు చేస్తున్న కీర్తి సురేష్ త‌మిళంలో అన్నాత్తి, పెంగ్విన్ చిత్రాల‌లో న‌టిస్తుంది.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo