సెలబ్రిటీల పర్సనల్ విషయాలు ఎప్పుడు ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. ప్రేమ, పెళ్లి విషయాల గురించి జనాలు ఎక్కువగా ఆసక్తి చూపుతుండడంతో అలాంటి వార్తలు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కొన్నాళ్లుగా కీర్తి సురేష్ పెళ్లిపై అనేక రూమర్స్ వస్తుండగా, వాటిని కొట్టిపారేస్తూ వస్తూనే ఉంది. తాజాగా కీర్తి సురేష్ వివాహానికి రెడీ అయిందని, చెన్నైకు చెందిన ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనుందని జోరుగా ప్రచారం నడిచింది.
ప్రచారం హోరుగా నడుస్తున్న నేపథ్యంలో కీర్తి సురేష్ స్పందించాల్సి వచ్చింది. అసలు తనకు పెళ్లి ఆలోచనే లేదని, తన దృష్టి మొత్తం సినిమాల మీదే ఉందని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే, అబ్బాయి ఫైనల్ అయ్యాక అందరి కంటే ముందు ఆ వార్త మీకు చెబుతానంటుంది కీర్తి సురేష్. కాగా, కీర్తి సురేష్ అనిరుధ్ రవిచంద్రన్‌తో ప్రేమలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం కీర్తి సర్కారు వారి పాట చిత్రీకరణతో బిజీగా ఉంది.