బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 04, 2020 , 23:02:17

పెళ్లికి వేళయిందా?

పెళ్లికి వేళయిందా?

కథానాయికల ప్రేమ, పెళ్లి తాలూకు వార్తలు  సినీ ప్రియుల్లో  ఉత్సుకతను కలిగిస్తుంటాయి. తాజాగా మలయాళీ సోయగం కీర్తి సురేష్‌ పెళ్లి వార్త చెన్నై సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. చెన్నైకి చెందిన ఓ రాజకీయ నేపథ్యమున్న వ్యాపారవేత్తతో ఈ సొగసరి పెళ్లికి సిద్ధమవుతోందని, పెద్దలు కుదిర్చిన సంబంధమిదని వార్తలొస్తున్నాయి. కీర్తి సురేష్‌ తండ్రి సురేష్‌కుమార్‌ గతంలో సినీ నిర్మాత. ఆయనకు తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ పార్టీతో సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో తనకు అత్యంత సన్నిహితుడైన మిత్రుడి కుమారుడితో  కీర్తి సురేష్‌ పెళ్లి జరిపించడానికి సురేష్‌కుమార్‌ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. తండ్రి ప్రతిపాదనకు కీర్తి సురేష్‌ ఓకే చెప్పిందని తెలుస్తోంది. త్వరలోనే వివాహానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. మరోవైపు కెరీర్‌పరంగా భారీ అవకాశాలు వరిస్తున్న ప్రస్తుత తరుణంలో కీర్తి సురేష్‌ వివాహం చేసుకునే అవకాశాలు ఏమాత్రం లేవని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.  ఈ పెళ్లి వార్తల్లో నిజానిజాలేమిటో తెలియాలంటే కీర్తి సురేష్‌ కుటుంబ సభ్యులు స్పందించేవరకు వేచిచూడాల్సిందే అంటున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్‌ తెలుగులో ‘గుడ్‌లక్‌ సఖీ’ ‘రంగ్‌దే’ చిత్రాల్లో నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం నితిన్‌ కథానాయకుడిగా కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందించబోతున్న ‘పవర్‌పేట’ చిత్రంలో కూడా కీర్తిసురేష్‌ కథానాయికగా ఖరారైందని సమాచారం.


logo