ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 14, 2020 , 12:34:39

సాయిపల్ల‌వి-కీర్తిసురేశ్ ఇద్ద‌రిలో ఎవ‌రు..?

సాయిపల్ల‌వి-కీర్తిసురేశ్ ఇద్ద‌రిలో ఎవ‌రు..?

టాలీవుడ్ యాక్ట‌ర్ చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత వేదాల‌మ్ రీమేక్, లూసిఫ‌ర్ రీమేక్ చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు చిరు. అయితే ప్రాజెక్టులు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి వీటికి సంబంధించిన వార్త‌లు లైమ్ లైట్ లోకి వ‌స్తున్నాయి. మెహ‌ర్ ర‌మేశ్ ఇప్ప‌టికే స్క్రిప్ట్ ప‌నులు, నటీన‌టుల ఎంపిక‌లో బిజీగా ఉన్నాడు. ఫ్యామిలీ డ్రామా నేప‌థ్యంలో సాగ‌నున్న వేదాల‌మ్ రీమేక్ లో చిరంజీవి సోద‌రిగా సాయిప‌ల్ల‌వి న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా మ‌రో పేరు  తైర‌పైకి వ‌చ్చింది. చిరు సిస్ట‌ర్ పాత్ర‌లో కీర్తిసురేశ్ పేరును కూడా మేక‌ర్స్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. 

వేదాళ‌మ్ ఒరిజిన‌ల్ వెర్ష‌న్ లో వ‌చ్చే సిస్ట‌ర్ రోల్ లో సినిమాలో కీల‌కంగా ఉంటుంది. ఈ పాత్ర‌లో ల‌క్ష్మీమీన‌న్ త‌మిళ ప్రేక్ష‌కులను మెప్పించింది. దీంతో ల‌క్ష్మీమీన‌న్ రోల్  లో అవార్డు విన్నింగ్ హీరోయిన్లైన సాయిప‌ల్ల‌వి, కీర్తిసురేశ్ ల‌లో ఎవ‌రిని  చిరు అండ్ టీం ఎంపిక చేస్తార‌నేది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాలి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo