బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 07, 2020 , 22:58:48

పవర్‌పేటలో కీర్తిసురేష్‌

పవర్‌పేటలో కీర్తిసురేష్‌

ప్రస్తుతం ‘రంగ్‌దే’ సినిమాలో జంటగా నటిస్తున్నారు నితిన్‌, కీర్తిసురేష్‌.  మరో సినిమాలో ఈ జోడీ  సందడి చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్‌ కథానాయకుడిగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్‌పేట’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కబోతున్నది. ఓ యువకుడి జీవితంలోని నాలుగు దశల్ని ఆవిష్కరిస్తూ రూపొందనున్న ఈ చిత్రంలో నితిన్‌ 20 ఏళ్ల నుంచి అరవై ఏళ్ల వయస్కుడిగా కనిపిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్‌ నటించనున్నట్లు తెలిసింది. కథతో పాటు తన పాత్రచిత్రణ నచ్చడంతో కీర్తిసురేష్‌ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు. పట్టణ ప్రాంతానికి చెందిన యువతిగా ఆమె కనిపించబోతున్నట్లు సమాచారం. గోదావరి యాసతో కీర్తిసురేష్‌ పాత్ర వినూత్నంగా సాగుతుందని చెబుతున్నారు.   రెండు భాగాలుగా  ఈ సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.logo