మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా ఆదరణ పొందిన నటి కీర్తి సురేష్. ఈ అమ్మడు హిట్స్,ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలతోను మధ్యమధ్యలో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తుంది. మహేష్ సరసన కథానాయికగా నటిస్తున్న కీర్తి .. చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో ఆయనకు సోదరిగా నటిస్తుంది.
కీర్తి నటించిన ‘మరక్కార్, గుడ్ లక్ సఖి, అన్నత్తే’ సినిమాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక తమిళ ‘సాని కాయిదం, వాశి’ సినిమాలు చేస్తుంది. ఇటీవల కాలంలో వరసగా ‘పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన కీర్తిని మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా పలకరించబోతోందట.బాలీవుడ్ సినిమా ‘మిమి’ తెలుగు, తమిళ రీమేక్ వెర్షన్ లో నటించటానికి కీర్తి సురేష్ ని సంప్రదించారట.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కీర్తి తాజాగా తన బేబి బాయ్ ఫొటో షేర్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. తాను మూడు సంవత్సరాల నుంచి పెంచుకుంటున్న నైకీ అనే కుక్క పిల్ల గురించి ఏమోషనల్ అవుతూ ఓ పోస్ట్ చేయగా, ఇందులో నైకీకి సంబంధించిన పాత ఫొటోలు షేర్ చేసింది. ఇవి నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.