బుధవారం 27 మే 2020
Cinema - May 09, 2020 , 07:54:05

వైర‌ల్‌గా మారిన హీరోయిన్ వ్య‌వ‌సాయం వీడియో

వైర‌ల్‌గా మారిన హీరోయిన్ వ్య‌వ‌సాయం వీడియో

లాక్‌డౌన్‌లో మ‌న భామ‌లు అంద‌రు ఇంటికే ప‌రిమిత‌మై అందాల‌పై దృష్టి పెడుతుంటే, త‌మిళ భామ కీర్తి పాండియ‌న్ మాత్రం  పొలంలో దిగి నాట్లేస్తుంది. ఇది చూసిన వారంద‌రు నోరెళ్ళ పెడుతున్నారు. మ‌న హీరోయిన్స్ అంద‌రు మేక‌ప్ ఛాలెంజ్‌, ఆ ఛాలెంజ్‌, ఈ ఛాలెంజ్ అనుకుంటూ స‌మ‌యాన్ని వృధా చేస్తుంటే కీర్తి మాత్రం సొంత పొలంలో నాట్లేస్తూ అంద‌రికి ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 

ప్రముఖ న‌టుడు అరుణ్ పాండియ‌న్ కుమార్తె  కీర్తి పాండియన్ తొలుత‌ తమిళ సినిమా 'తుంబ' ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం విలన్‌ అనే మలయాళ చిత్ర తమిళ రీమేక్‌‌లో నటిస్తోంది. అయితే లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైన ఈ అమ్మ‌డు సొంత పొలంలో నాటేస్తూ, టాక్టర్ డ్రైవ్ చేస్తూ అచ్చ‌మైన ప‌ల్లెటూరి పిల్ల‌లా హంగామా చేసింది. కీర్తి వ్య‌వ‌సాయపు ప‌నుల‌కి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది 


logo