ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 14, 2020 , 12:42:09

కేదార్‌నాథ్‌, తానాజీ, మ‌లంగ్‌.. రీరిలీజ్‌కు రెఢీ

కేదార్‌నాథ్‌, తానాజీ, మ‌లంగ్‌.. రీరిలీజ్‌కు రెఢీ

హైద‌రాబాద్‌: బాలీవుడ్ మెగాహిట్ సినిమాలు కొన్ని రీరిలీజ్‌కు రెఢీ అయ్యాయి. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఆరు నెల‌ల పాటు మూత‌ప‌డ్డ థియేట‌ర్లు .. ఈనెల 15వ తేదీ నుంచి తెరుచుకోనున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ ఓ ఆరు హిట్ మూవీల‌ను మ‌ళ్లీ రిలీజ్ చేస్తున్న‌ది.  దానికి సంబంధించి ట్రేడ్ అన‌లిస్ట్ త‌రుణ్ ఆద‌ర్శ్ ఇవాళ ఓ ట్వీట్ చేశారు.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ న‌టించిన కేదార్‌నాథ్‌తో పాటు అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించిన తానా‌జీ లాంటి చిత్రాల‌న రీరిలీజ్ చేయ‌నున్నారు. రీరిలీజ్‌ జాబితాలో శుభ్‌మంగ‌ల్ జ్యాదా సావ‌దాన్‌, త‌ప్ప‌డ్‌, వార్ సినిమాలు కూడా ఉన్నాయి.  ప్ర‌ధాని మోదీ బ‌యోగ్ర‌ఫీ ఆధారంగా తీసిన పీఎం మోదీ సినిమాను కూడా ఈనెల 15వ తేదీన రీరిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. logo