శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 19:26:24

రూ.10 కోట్లు అడ్వాన్స్ తీసుకున్న సుకుమార్‌..?

రూ.10 కోట్లు అడ్వాన్స్ తీసుకున్న సుకుమార్‌..?

టాలీవుడ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తో విజ‌య్ దేవ‌ర కొండ సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త మూవీ చేస్తున్న‌ట్టు చెప్ప‌డంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం అంద‌రి వంతైంది. ఈ చిత్రాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ స్నేహితుడు కేదార్ నిర్మించ‌నుండ‌గా..2022 లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

కేదార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కు రూ.10 కోట్లు అడ్వాన్స్ ఇచ్చాడ‌ని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు సినిమా విడుద‌ల‌య్యాక వ‌చ్చే లాభాల్లో కొంత షేర్ ను కూడా తీసుకోనున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్‌. ఈ ప్రాజెక్టు షురూ అయ్యేందుకు ఏడాదికి పైగా స‌మ‌యం ప‌ట్ట‌నుండ‌గా..నిర్మాత ఇంత మొత్తంలో అడ్వాన్స్ ను ముందే ముట్ట‌జెప్పార‌నే వార్త‌ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి సినిమా ప్ర‌క‌టించిన త‌క్కువ టైంలోనే ఆస‌క్తిక‌ర అంశాల‌తో వార్త‌ల్లో నిలుస్తోంది విజ‌య్-సుకుమార్ ప్రాజెక్టు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo