బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 24, 2020 , 23:48:18

కేసీఆర్‌ మాట ప్రపంచ చరిత్రలో నిలుస్తుంది

కేసీఆర్‌ మాట ప్రపంచ చరిత్రలో నిలుస్తుంది

‘తెలంగాణ నీళ్లు తాగుతూ హైదరాబాద్‌ గడ్డమీద పుట్టినటువంటి ఎంతో మంది తెలంగాణ బిడ్డలకు ఫాదర్‌ ఆఫ్‌ ది నేషన్‌గా కేసీఆర్‌ నిలుస్తున్నారు. ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టారంటే  ఓ భరోసా. ఆయన మాటలు హాయిగా అనిపిస్తాయి. మనందరిని ఈ కరోనా బారి నుంచి ఒడ్డున పడేస్తాడు అనే అభయం లభిస్తుంది.  పండితుడి నుంచి పామరుడు వరకు అందరికి కేసీఆర్‌గారు ధైర్యాన్నిస్తున్నారు’  అని  అన్నారు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనితీరుపై బ్రహ్మానందం ప్రశంసలు కురిపించారు. కరోనా కట్టడి విషయంలో ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. బ్రహ్మానందం మాట్లాడుతూ ‘కేసీఆర్‌ చాలా గొప్పవారు. ఆయన గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు అంగీకరించాలి. ప్రజా శ్రేయస్సుకోసం అనుక్షణం తపిస్తూ,  కోరిన అన్ని సదుపాయాల్ని కల్పిస్తున్నారాయన. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరం పనిచేస్తూ వ్యవహారాల్ని చక్కదిద్దుతున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత  కేసీఆర్‌గారి బాగోగుల్ని చూస్తున్న సతీమణి  శోభగారికి ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మంత్రు లు కేటీఆర్‌, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ రాష్ట్రం కోసం మేమున్నాం అని చెప్పడం మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నారు. ప్రజలందరిని సరైన మార్గంలో పెట్టడం కోసం, అందరి ప్రాణాలు కాపాడటం కోసం కృషిచేస్తున్నారు.  తెలంగాణ రాష్ర్టానికి మార్గనిర్ధేశనం చేస్తూ, ఎవరూ పస్తులు ఉండకూడదనే సంకల్పంతో పనిచేస్తున్నారు. ‘ఎవరూ ఆకలితో అలమటించకూడదు’ అన్నది కేసీఆర్‌గారి బెస్ట్‌ స్లోగన్‌గా భావిస్తున్నా. ఒక తెలంగాణలోనే కాదు ప్రపంచ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మాట ఇది. ఇట్‌ షుడ్‌ బీ రిటెన్‌ ఇన్‌ ది వరల్డ్‌ లైబ్రరీ. గొప్ప చదువరి, విజ్ఞుడు, జ్ఞాని, బహుముఖప్రజ్ఞాశాలి కాబట్టే కేసీఆర్‌ ఆ మాట అనగలిగాడు’ అని బ్రహ్మానందం చెప్పారు.  మానవ తప్పిదాల వల్లే కరోనా  విపత్కర పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనందరి కోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు,   పోలీసులకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలుపాలని బహ్మానందం కోరారు. logo