బుధవారం 03 జూన్ 2020
Cinema - May 15, 2020 , 10:57:59

వెండితెర‌పై పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో బిగ్ బాస్ ఫేం కౌశ‌ల్‌..!

వెండితెర‌పై పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో బిగ్ బాస్ ఫేం కౌశ‌ల్‌..!

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్‌2తో ఫుల్ పాపులారిటీ పొందిన వ్య‌క్తి కౌశ‌ల్‌. సీజ‌న్ 2 టైటిల్ అందుకున్న త‌ర్వాత కౌశ‌ల్‌కి వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ వ‌స్తాయ‌ని ఆయ‌న అభిమానులు భావించారు. కాని సీన్ రివ‌ర్స్ అయింది. కొద్ది రోజులుగా యాడ్ ఏజెన్సీకే ప‌రిమిత‌మైన కౌశ‌ల్‌కి తాజాగా ఓ సినిమా ఆఫ‌ర్ వ‌చ్చింది 

సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కౌశల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. చిత్రంలో పోలీసాఫీసర్‌ పాత్ర చాలా కీల‌కం కాగా, కౌశ‌ల్‌ని ఎంపిక చేసిది చిత్ర బృందం. ఈ రోజు కౌశ‌ల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న లుక్ విడుద‌ల చేశారు. బైక్‌పై పోలీస్ డ్రెస్‌తో కూర్చొని ఉన్న కౌశ‌ల్ లుక్ ఆయ‌న ఫ్యాన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. జీబీ క్రిష్ణ దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రంకి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.


logo