శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 18, 2021 , 07:44:32

బిగ్ బాస్ విన్న‌ర్ కౌశ‌ల్ కొత్తింటి ఫొటోలు వైర‌ల్

బిగ్ బాస్ విన్న‌ర్ కౌశ‌ల్ కొత్తింటి ఫొటోలు వైర‌ల్

బిగ్ బాస్ సీజ‌న్ 2 విన్న‌ర్ కౌశ‌ల్ మండా తను క‌న్న క‌ల‌ను నెర‌వేర్చుకున్నాడు. కొత్త ఏడాదిలో కొత్తింట్లోకి అడుగుపెట్టి త‌న ఆనందాన్ని అభిమానుల‌తో షేర్ చేసుకున్నాడు. గృహ ప్ర‌వేశానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రాములో షేర్ చేయ‌గా, ఇవి ఫుల్ వైర‌ల్ అయ్యాయి. కౌశ‌ల్‌కు అభిమానులు, సెల‌బ్రిటీల నుండి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

క‌రోనా వ‌ల‌న కేవ‌లం కుటుంబ స‌భ్యుల‌ని మాత్ర‌మే త‌న ఇంటి గృహ‌ప్ర‌వేశానికి ఆహ్వానించిన‌ట్టు తెలుస్తుంది.కౌశ‌ల్ త‌న‌  స‌తీమణి నీలిమ, పిల్లలు నికుంజ్‌, లల్లితో కలిసి గృహ ప్రవేశ వేడుక‌లో  తెగ సంద‌డి చేశాడు. గ‌త కొద్ది రోజులుగా బిగ్ బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్స్‌ను ఇంట‌ర్వ్యూ చేస్తున్న కౌశ‌ల్ వారి ద‌గ్గ‌ర నుండి ఆస‌క్తిక‌ర విష‌యాలు రాబ‌ట్టి ప్రేక్ష‌కులను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేసిన విష‌యం తెలిసిందే. 


VIDEOS

logo