ఆదివారం 07 మార్చి 2021
Cinema - Jan 23, 2021 , 05:49:28

గీతా గోపీనాథ్‌పై బిగ్ బీ అనుచిత వ్యాఖ్య‌లు! నెటిజ‌న్ల ట్రోల్స్‌

గీతా గోపీనాథ్‌పై బిగ్ బీ అనుచిత వ్యాఖ్య‌లు! నెటిజ‌న్ల ట్రోల్స్‌

ముంబై: ‌బాలీవుడ్ సూప‌ర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ అంటే తెలియని వారు ఉండ‌రు. అంద‌రికీ ఆద‌ర్శంగా నిలువాల్సిన బిగ్ బీ.. చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి 12వ సీజ‌న్‌లో కంటెస్టెంట్‌గా అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) చీఫ్ ఎక‌న‌మిస్ట్ గీతా గోపీనాథ్ పాల్గొన్నారు. ఆమెను ఏ సంస్థ‌కు చీఫ్ ఎక‌న‌మిస్ట్‌గా ఉన్నార‌ని ప్ర‌శ్నించారు. అంత వ‌ర‌కు బాగానే ఉంది.. గీతా గోపీనాథ్ అందాన్ని అభివ‌ర్ణిస్తూ అమితాబ్ బ‌చ్చ‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపాయి.

‘ఇత్నా కబ్‌సూరత్ చెరా ఇంకా. ఎకాన‌మీ కే సాత్ కోయి జోర్ హి నీ సక్తా (ఆమె ముఖం ఎంతో అందంగా ఉంది. ఏ ఆర్థిక వ్య‌వ‌స్థ‌తో ఆమె అందాన్ని స‌రిపోల్చ‌గ‌లం)’ అని వ్యాఖ్యానించారు. దీనిపై గీతా గోపీనాథ్ స్పందించారు. ‘ఓకే. దీని గురించి నేను ప‌ట్టించుకోను. సీనియ‌ర్ బ‌చ్చ‌న్‌కు నేను గొప్ప ఫ్యాన్‌ను. ఈ వీడియో ఎంతో ప్ర‌త్యేకం’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు కూడా బిగ్ బీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. అయితే మ‌హిళ అందాన్ని వ‌ర్ణించ‌డంపై నెటిజ‌న్లు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు.

అందాన్ని మెద‌ళ్ల‌తో పోల్చినందుకు ఆయ‌న‌ను లైక్ చేయ‌డం లేద‌ని పేర్కొంటూ స‌ద‌రు క్లిప్‌తో ట్వీట్ చేశారు. అంద‌మైన మ‌హిళ‌లు ఎక‌న‌మిస్ట్‌లు కాకూడ‌ద‌న్న‌ట్లు అమితాబ్ బ‌చ్చ‌న్ వ్యాఖ్య ఉంద‌ని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించారు. మ‌రో ట్విట్ట‌ర్ యూజ‌ర్ స్పందిస్తూ అంద‌మైన వారు ఎకాన‌మీతో ఎందుకు అనుసంధానం కాకూడ‌దు? అని రియాక్ట‌య్యారు. 2019 నుంచి గీతా గోపీనాథ్.. ఐఎంఎఫ్‌కు చీప్ ఎక‌న‌మిస్ట్‌గా ఉన్నారు. ఈ సంస్థ చీఫ్ ఎక‌న‌మిస్ట్‌గా ఎంపికైన తొలి మ‌హిళ ఆమె. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo