గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 05, 2020 , 02:54:39

కత్రినా ప్రత్యేకగీతం

కత్రినా ప్రత్యేకగీతం

‘చిక్నీ ఛమేలి’, ‘షీలా కీ జవానీ’ లాంటి ప్రత్యేక గీతాల్లో అందాలప్రదర్శనతో పాటు అదిరిపోయే స్టెప్పులతో అభిమానుల హృదయాల్ని దోచుకున్నది కత్రినాకైఫ్‌. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ ఐటెంసాంగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది ఈ సుందరి. అలియాభట్‌ కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం  ‘గంగుబాయి కథియావాడి’. హుస్సేన్‌ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబాయి’ నవల ఆధారంగా దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వేశ్యగా జీవితాన్ని మొదలుపెట్టి కామటిపుర ప్రాంతానికి అధినేతగా ఎదిగిన గంగుబాయి అనే మహిళా కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. 


ఈ మహిళా ప్రధాన చిత్రంలో ప్రత్యేక గీతంలో కత్రినాకైఫ్‌ నటించబోతున్నది. విభిన్నమైన గెటప్‌లో కత్రినాను ఆవిష్కరిస్తూ ఈ పాటను సంజయ్‌లీలా భన్సాలీ చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్‌ అగ్ర కథానాయికలు అలియాభట్‌, కత్రినాకైఫ్‌ ఒకే సినిమాలో కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. సెప్టెంబర్‌లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకురానున్నది. ప్రస్తుతం కత్రినాకైఫ్‌.. అక్షయ్‌కుమార్‌, దర్శకుడు రోహిత్‌శెట్టి కలయికలో రూపొందుతున్న ‘సూర్యవన్షీ’ సినిమాలో కథానాయికగా నటిస్తున్నది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్‌దేవ్‌గన్‌,రణ్‌వీర్‌సింగ్‌ అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 24న ఈ చిత్రం విడుదలకానుంది. 


logo