బాలీవుడ్ (Bollywood) భామ కత్రినాకైఫ్ (Katrina Kaif), హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal) కొన్నాళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు టైం దొరికిప్పుడల్లా ఒక్క చోట చేరి సందడి చేస్తుంటారు. ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తారు. అయితే ఈ జంట నిశ్చితార్థ (Engagement) ఉంగరాలు మార్చుకుందని ఇవాళ ఉదయం నుంచి వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
విక్కీకౌశల్, కత్రినాకైఫ్ కు సంబంధించిన స్టిల్ వైరల్ అవడంతో..అభిమానులు, ఫాలోవర్లు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఈ పుకార్లపై సాయంత్రానికల్లా కత్రినాకైఫ్ టీం నుంచి ఓ క్లారిటీ వచ్చింది. రోకా సెర్మనీ (ప్రీ వెడ్డింగ్ సెర్మనీ), ఎంగేజ్ మెంట్ కార్యక్రమం లాంటివి ఏం జరుగలేదు. కత్రినా, విక్కీ రింగ్స్ మార్చుకోలేదు. అంతేకాదు కత్రినాకైఫ్ త్వరలోనే టైగర్ 3 (Tiger 3) షూటింగ్ పూర్తి చేయనుందని కత్రినాకైఫ్ టీం తెలిపింది.
కత్రినాకైఫ్ ప్రస్తుతం రోహిత్‌శెట్టి డైరెక్షన్ లో అక్షయ్ కుమార్ తో కలిసి సూర్యవంశి చిత్రంలో నటిస్తోంది. మరోవైపు ఫోన్ భూత్, విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తోంది. విక్కీ కౌశల్ సర్దార్ ఉధమ్ సింగ్, ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ, తఖ్త్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
ఇవికూడా చదవండి..
Regina Cassandra| అస్థిపంజరాన్ని పరీక్షిస్తున్న రెజీనా
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!