ఈ కాలం నాటి అందాల భామలు మంచి ఫిజిక్ కోసం జిమ్‌లో నిత్యం కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ట్రైనర్ సమక్షంలో వీరు చేస్తున్న వర్కవుట్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతూ ఉంటుంది. తాజాగా క్యూట్ కత్రినా జిమ్‌లో వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేసింది.
ఇందులో కత్రినా చేస్తున్న వర్కవుట్స్ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఈ వయస్సులోను కత్రినా స్టన్నింగ్‌గా ఉండడానికి కారణం ఇదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కత్రినా తన వీడియోకి .. “నేను నా మనసుకు శిక్షణ ఇస్తాను.. దాన్ని నా బాడీ ఫాలో అవుతుంది. లేదంటే రెజా కటానికి (ఫిట్నెస్ ట్రైనర్) కాల్ చేస్తా’’ అనే క్యాప్షన్‌ను జోడించింది. కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన టైగర్-3 మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం సల్మాన్‌తో కలిసి టర్కీ కూడా వెళ్లిన విషయం తెలిసిందే.