మంగళవారం 07 జూలై 2020
Cinema - May 29, 2020 , 22:46:26

నయనతార పోరాట యోధురాలు

నయనతార పోరాట యోధురాలు

నయనతార ఓ పోరాట యోధురాలని అంటోంది కత్రినాకైఫ్‌.  అందచందాలతో పాటు అద్భుతమైన ప్రతిభాసామర్థ్యాలు ఆమె సొంతమని నయనతారపై ప్రశంసలు కురిపించింది.  కత్రినాకైఫ్‌ ‘కేబై కత్రినా’ పేరుతో సొంతంగా సౌందర్య ఉత్పత్తి సాధనాల బ్రాండ్‌ను ఆరంభించింది. గత ఏడాది జరిగిన ఈ బ్రాండ్‌ ప్రచార కార్యక్రమాల్లో నయనతార పాల్గొన్నది. దక్షిణాది సినిమాలతో బిజీగా ఉండి కూడా తన బ్రాండ్‌ ప్రచారంలో నయనతార పాల్గొనడం ఆనందంగా ఉందని  ఆమెకు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటానని కత్రినాకైఫ్‌ తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్యూలో నయనతారతో పనిచేయడాన్ని గురించి కత్రినా వెల్లడిస్తూ ‘వృత్తిపట్ల నయనతార అంకితభావం, ఆమె పనిచేసే విధానం అద్భుతంగా ఉంటాయి. తనలో  ఏదో తెలియని మహత్తర శక్తి ఉంది.  చిన్న వయసులోనే నటనను  వృత్తిగా ఎంచుకున్నది. పని గురించి  స్పష్టత ఉంది. తనకు ఏం కావాలో తెలుసు.  ఒక్క సారి పనిలో పడితే అమితంగా ప్రేమించి చేస్తుంది. నయనతార  సెట్స్‌లో ఉంటే మన ప్రతిబింబాన్ని మనమే అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది’ అని తెలిపింది. logo