శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Cinema - Mar 24, 2020 , 16:53:31

ఇంట్లో పాత్ర‌లు క‌డిగిన క‌త్రినా..వీడియో వైర‌ల్

ఇంట్లో పాత్ర‌లు క‌డిగిన క‌త్రినా..వీడియో వైర‌ల్

క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌జ‌ల‌తోపాటు చాలా మంది సెల‌బ్రిటీలు సెల్ప్ హోం క్వారంటైన్‌కు ప‌రిమితమవుతున్న విష‌యం తెలిసిందే. ఇంట్లో ఉన్న స‌మ‌యాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో టిప్స్ చెప్తూఇటీవ‌లే  బాలీవుడ్ న‌టి ప్రీతి జింటా తన త‌ల్లి త‌లకు మ‌సాజ్ చేసిన  ఓ వీడియో పోస్ట్ చేసింది. .తాజాగా మ‌రో బ్యూటీ క‌త్రినాకైఫ్ ఇంట్లో వంట పాత్ర‌లను కడుగుతున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇంట్లో సాయం చేయండి. సోష‌ల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సుర‌క్షితంగా ఉండండి అంటూ క‌త్రినా పోస్ట్ చేసిన వీడియో వైర‌ల్ అవుతోంది. logo