ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 14, 2020 , 13:39:41

కత్తి మహేష్‌ అరెస్ట్‌.. ఎందుకో తెలుసా?

కత్తి మహేష్‌ అరెస్ట్‌.. ఎందుకో తెలుసా?

కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్ క‌త్తి మ‌హేష్‌. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద సంచ‌ల‌న వ్యాఖ్యలు చేస్తూ త‌ర‌చూ వార్త‌ల‌లో నిలిచిన క‌త్తి ఆ త‌ర్వాత దేవుళ్లు, రాజ‌కీయాలు త‌దిత‌ర అంశాల‌కి సంబంధించి వివాదాస్ప‌ద కామెంట్స్ చేశాడు. ఓ సారి ఆయ‌న అభ్యంత‌ర వ్యాఖ్య‌లు చేసి హైదరాబాద్‌ బహిష్కరణకు సైతం గురయ్యారు. తాజాగా ఆయ‌న హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై అనుచిత కామెంట్స్ చేయ‌డంతో హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

ఉస్మానియా హాస్పిట‌ల్ లో వైద్య పరీక్షల త‌ర్వాత‌ నాంపల్లి కోర్టులో క‌త్తి మ‌హేష్‌ని హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల‌ రిమాండ్ విధించింది. ఐపీఎస్‌ సెక్షన్‌ 153(ఎ​) కమ్యూనల్‌ యాక్ట్‌ కింద సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, క‌త్తి మ‌హేష్‌ కొన్ని నెలల క్రితం త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో శ్రీరాముడి గురించి (రాముడు కరోనా ప్రియుడు) అసభ్యకర పోస్ట్ లు పెట్టారు. దీంతో హిందూ సంఘాలు క‌త్తి మ‌హేష్ పై పలు చోట్ల కేసులు పెట్టాయి. వారి ఫిర్యాదుల ఆధారంగా  ప‌లుసార్లు విచారించిన పోలీసులు.. విచారణ త‌ర్వాత‌ ఆయన్ను అరెస్ట్ చేశారు. 

logo