బుధవారం 20 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 00:08:37

కథ మొదలైంది!

కథ మొదలైంది!

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి శిష్యుడు సాయికృష్ణ కేవీ దర్శకత్వంలో ‘కథ మొదలైంది’ పేరుతో బుధవారం హైదరాబాద్‌లో ఓ సినిమా మొదలైంది. సీనియర్‌ నటుడు సురేష్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తమటం కుమార్‌రెడ్డి, సన్నిధి ప్రసాద్‌, టి.రమేష్‌ నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత తమటం కుమార్‌ రెడ్డి క్లాప్‌నిచ్చారు.  దర్శకుడు మాట్లాడుతూ ‘సమాజంలో మన చుట్టు జరిగే సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని రూపొందిస్తున్న చిత్రమిది. కామెడీ,సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల వారికి నచ్చే అంశాలున్నాయి’ అన్నారు. ఈ చిత్రానికి కథ:జయకుమార్‌. 


logo