శనివారం 30 మే 2020
Cinema - Apr 26, 2020 , 15:49:39

విజ‌య్ దేవ‌ర‌కొండ ఫౌండేష‌న్‌కి చేయూత‌గా కొర‌టాల‌, కార్తికేయ‌

విజ‌య్ దేవ‌ర‌కొండ ఫౌండేష‌న్‌కి చేయూత‌గా కొర‌టాల‌, కార్తికేయ‌

చేసింది కొన్ని సినిమాలే అయిన స్టార్ హీరోకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. కేవ‌లం రీల్ లైఫ్ లోనే కాకుండా ప‌లు మార్లు రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు. ఆ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తాజాగా కరోనా వైరస్‌ సంక్షోభంతో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న సామాన్యులను చేయూతనివ్వడానికి ముందుకొచ్చాడు. రూ.25లక్షల రూపాయలతో ‘మిడిల్‌ క్లాస్‌ ఫండ్‌(ఎం.సి.ఎఫ్‌) ఏర్పాటు చేసిన విజ‌య్ యువతకు ఉద్యోగాలు ఇప్పించేందుకు ‘ది విజయ్‌ దేవరకొండ ఫౌండేషన్‌(టి.డి.ఎఫ్‌)’ను ఏర్పాటు చేశారు.

ఈ సంక్షోభ సమయంలో నిత్యవసరాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న వారికోసం ఏర్పాటైన ఎంసీఎఫ్ కోసం ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ ల‌క్ష రూపాయల విరాళం అందించారు. ఇక కొర‌టాల శివ .. ప‌దిమందికి తోడుగా ఉండే ప‌నుల్లో నీకు తోడుగా నేనుంటా. కుమ్మేద్దాం. మంచితో. త్వ‌ర‌లోనే క‌లుద్దాం అని ట్వీట్ ద్వారా తెలిపారు

 


logo