సోమవారం 13 జూలై 2020
Cinema - May 27, 2020 , 11:09:40

కార్తికేయ సిక్స్ ప్యాక్ లుక్ వైర‌ల్

కార్తికేయ సిక్స్ ప్యాక్ లుక్ వైర‌ల్

ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న కార్తికేయ ఆ త‌ర్వాతి సినిమాల‌తో పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయాడు. ప్ర‌స్తుతం చావుకబురు చల్లగా అనే మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ విడుదల కాగా విశేష ఆదరణ దక్కించుకుంది. బస్తీ మాస్ కుర్రాడిగా సంద‌డి చేయ‌నున్నాడు.

తాజాగా  యంగ్ హీరో కార్తికేయ సిక్స్ ప్యాక్ లుక్‌కి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో హల్ చ‌ల్ చేస్తున్నాయి. బేర్ బాడీతో త‌న కండ‌లు చూపిస్తూ అమ్మాయిల గుండెల‌లో బాణాలు దించుతున్నాడు. లాక్‌డౌన్ స‌మ‌యంలో  కార్తికేయ తన శ‌రీరంపై పూర్తి దృష్టి పెట్టి సిక్స్ ప్యాక్‌తో సంద‌డి చేస్తున్నాడ‌ని అంటున్నారు. కార్తికేయ ఆర్ఎక్స్ 100 చిత్రం త‌ర్వాత గుణ 369,90 ఎల్ అనే చిత్రాల‌లో న‌టించారు. 


logo