బుధవారం 08 జూలై 2020
Cinema - Jun 02, 2020 , 15:55:33

కార్తికేయకు చిరంజీవి సర్ ప్రైజ్ మెసేజ్..!

కార్తికేయకు చిరంజీవి సర్ ప్రైజ్ మెసేజ్..!

హైదరాబాద్: ఆర్ఎక్స్100 హీరో కార్తికేయ స్టన్నింగ్ లుక్ తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. కార్తికేయ సిక్స్ ప్యాక్  ఫొటోలు అందరిని మెస్మరైజ్ చేశాయి.  లాక్ డౌన్ సమయాన్ని వర్కవుట్స్ కోసం వినియోగించుకుని..సిక్స్ ప్యాక్ లుక్ కోసం చాలా కష్టపడ్డాడు కార్తికేయ . ఈ యువ హీరోకు మెగాస్టార్ చిరంజీవి నుంచి సందేశం వచ్చిందట.

ఇటీవలే కార్తికేయ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు. చిరు ‘ఎంత పరివర్తన’ అంటూ సిక్స్ ప్యాక్ కోసం తాను పడిన కష్టాన్ని గుర్తు చేస్తూ తనకు సర్ ప్రైజ్  మెసేజ్ పంపాడని కార్తికేయ పేర్కొన్నాడు. ఊహించని రీతిలో మెగాస్టార్ నుంచి ప్రశంసలు దక్కడంతో కార్తికేయ తన ఆనందానికి అవధులు లేకుండా పోయిందన్నాడు . 


logo