శనివారం 30 మే 2020
Cinema - May 09, 2020 , 13:03:42

'ఆకాశ‌వాణి' నుండి అర్ధాంత‌‌రంగా త‌ప్పుకున్న రాజ‌మౌళి త‌న‌యుడు

'ఆకాశ‌వాణి' నుండి అర్ధాంత‌‌రంగా త‌ప్పుకున్న రాజ‌మౌళి త‌న‌యుడు

విభిన్న కాన్సెప్ట్‌తో రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ నిర్మిస్తోన్న చిత్రం ‘ఆకాశ‌వాణి’. చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమాని నుండి కార్తికేయ అర్ధాంత‌రంగా త‌ప్పుకుంటున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాడు. మ‌రో సినిమాకి తాను లైన్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌ని చేస్తున్న నేప‌థ్యంలో రెండు సినిమాల‌కి స‌రైన స‌మ‌యం కేటాయించ‌లేక‌పోవ‌డం వ‌ల‌నే త‌ప్పుకుంటున్న‌ట్టు చెప్పాడు. ఆకాశ‌వాణి మొద‌లైన‌ప్ప‌టి నుండి త‌న‌కి అండ‌గా నిలిచిన ద‌ర్శ‌కుడు, టీం మెంబ‌ర్స్ అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు కార్తికేయ‌.

ఆకాశ‌వాణి చిత్రానికి  అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.  ఏ. పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే కార్తికేయతో కొన్నాళ్ళ ప్ర‌యాణంకి సంబంధించి ద‌ర్శకుడు అశ్విన్ కూడా ప్రెస్ నోట్ విడుద‌ల చేశారు. అనివార్య కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ నుండి ఇద్ద‌రం విడిపోవ‌ల‌సి వ‌చ్చింది. ఒక‌రిపై ఒక‌రికి త‌ప్ప‌క గౌర‌వం ఉంటుంద‌ని అశ్విన్ స్ప‌ష్టం చేసారు.


logo