బుధవారం 27 మే 2020
Cinema - Apr 24, 2020 , 19:31:04

కార్తీకేయ నా రైట్‌హ్యాండ్‌: ఎస్‌.ఎస్‌.రాజమౌళి

కార్తీకేయ నా రైట్‌హ్యాండ్‌: ఎస్‌.ఎస్‌.రాజమౌళి

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా అనగానే ఖచ్చితంగా ఆ సినిమా సాంకేతిక నిపుణుల జాబితాలో ఆయన కుటుంబ సభ్యులే అధికంగా కనిపిస్తారు. రచయితగా రాజమౌళి నాన్న విజయేంద్రప్రసాద్‌, సంగీతం కీరవాణి, కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా రమా రాజమౌళి, పబ్లిసిటి వింగ్‌లో వల్లి (కీరవాణి శ్రీమతి) రాజమౌళి సినిమాకు టెక్నిషియన్స్‌గా వుంటారు. అయితే బాహుబలి, బాహుబలి-2 సినిమాలతో ఈ లిస్ట్‌లో మరో యువ టెక్నిషియన్‌ కూడా చేరాడు. అతనే రాజమౌళి తనయుడు కార్తీకేయ. బాహుబలి సినిమా రెండో యూనిట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన  కార్తీకేయ మంచి మార్కులే సంపాందించుకున్నాడు. అంతేకాదు దర్శకత్వం విభాగంలో రాజమౌళికి పూర్తి సపోర్ట్‌గా కార్తీకేయనే చెప్పుకొవచ్చు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌  సినిమాకు కూడా కార్తీకేయ ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. రాజమౌళికి పనిఒత్తిడి తగ్గించడంలో కార్తీకేయ బాగా ఉపయోగపడతాడని యూనిట్‌ సభ్యులు చెబుతుంటారు. అంతేకాదు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీకేయ తన కుడిభుజమని రాజమౌళి చెప్పడం ఆయన ప్రాధాన్యత ఏమిటో చెబుతుంది.


logo