ఇప్పటివరకు లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమాలతో అలరించిన బాలీవుడ్ లవర్ బాయ్ కార్తీక్ ఆర్యన్ రూట్ మార్చేశాడు. ఈ సారి సీరియస్ పాత్రతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. కార్తీక్ ఆర్యన్ నటిస్తోన్న కొత్త ప్రాజెక్టు కెప్టెన్ ఇండియా. ఆర్ఎస్ వీపీ, బవేజా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇండియన్ హిస్టరీలో అత్యంత విజయవంతమైన రెస్క్యూ ఆపరేషన్ చుట్టూ కెప్టెన్ ఇండియా సాగనుంది.
హన్సాల్ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ విషయాన్ని కార్తీక్ ఆర్యన్ ట్విటర్ ద్వారా తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను షేర్ చేశాడు. కార్తీక్ ఆర్యన్ పైలట్ డ్రెస్ లో ఉండగా..కెప్టెన్ క్యాప్ అతడి ముఖాన్ని కవర్ చేస్తోంది. కార్తీక్ ఆర్యన్ పైలట్ లుక్ పోస్టర్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కెప్టెన్ ఇండియా ఉత్కంఠభరితంగా ఉంటుంది. మన దేశ చారిత్రాత్మక అధ్యాయంలో భాగం కావడం చాలా గర్వంగా అనిపిస్తుంది. హన్సాల్ సర్ పని తీరుపై నాకు అపారమైన గౌరవం ఉంది. ఆయనతో సహకరించడానికి ఇది సరైన అవకాశమని కార్తీక్ ఆర్యన్ అన్నాడు.
ఇవి కూడా చదవండి..
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
నాగశౌర్య మేనేజర్ గా వెంకట్..అతనెవరో తెలుసా..?
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..