మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 12, 2020 , 09:51:42

ఆ హీరోయిన్ అందాల‌కి ఫిదా అయిన చిరుత‌

ఆ హీరోయిన్ అందాల‌కి ఫిదా అయిన చిరుత‌

సినీ సెల‌బ్రిటీల‌కి సాహసాలు కొత్తేమి కాదు. షూటింగ్‌లో భాగంగా ఒక్కోసారి వారు చేసే ఫీట్స్ ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తాయి. కొంద‌రు హీరోయిన్స్ కూడా హీరోల‌తో పోటీగా సాహ‌సాలు చేస్తుంటారు. బాలీవుడ్ భామ క‌రీష్మా క‌పూర్ షూటింగ్ టైంలో చిరుత పులితో క‌లిసి ఫోటో దిగింది. ఈ ఫోటోని కరీనా త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయండ‌తో వైర‌ల్‌గా మారింది.

2000 సంవ‌త్స‌రంలో గోవిందా హీరోగా తెర‌కెక్కిన షికారి సినిమాలో క‌రీష్మా క‌థానాయిక‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. ద‌క్షిణాఫ్రికాలో జ‌రిగిన షూటింగ్ స‌మ‌యంలో చిరుత క‌రీష్మా ద‌గ్గ‌రికి వ‌చ్చింది. ఆ పిక్‌ని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన క‌రీష్మా..జీప్ మీద ఒకవైపు నేను.. మరోవైపు చిరుత. మొదట్లో కాస్త భయం వేసింది. కానీ ఆ క్ష‌ణాలు అలా ఉండిపోయాయి అంటూ చెప్పుకొచ్చింది క‌రీష్మా. ఆమె ఎదురుగా ఉన్నా కూడా క‌రీష్మాని చిరుత ఏమి అన‌లేదంటే అమ్మ‌డి అందాల‌కి చిరుత కూడా ఫిదా అయిందా ఏంటి అని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo