మంగళవారం 19 జనవరి 2021
Cinema - Nov 05, 2020 , 15:43:41

ఎన్సీబీ విచార‌ణ‌కు హాజరైన దీపిక మేనేజ‌ర్

ఎన్సీబీ విచార‌ణ‌కు హాజరైన దీపిక మేనేజ‌ర్

బాలీవుడ్ లో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం దుమారం రేపుతుంది. సుశాంత్ సింగ్ మృతి త‌ర్వాత  డ్ర‌గ్స్ కుంభ‌కోణంకి సంబంధించి అనేక విష‌య‌లు బ‌య‌ట‌ప‌డ‌డంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఈ విష‌యంపై లోతుగా ద‌ర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ఇప్ప‌టికే రియా చ‌క్ర‌వ‌ర్తిని అదుపులోకి తీసుకొని అనేక విష‌యాలు రాబ‌ట్ట‌డంతో పాటు ఆమె స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేశారు. 

దీపికా ప‌దుకొణే ఆమె మేనేజ‌ర్ క‌రీష్మా ప్ర‌కాశ్‌, శ్ర‌ద్ధా క‌పూర్, ర‌కుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్‌ల‌ను కూడా ఎన్సీబీ విచారించింది. అయితే రీసెంట్‌గా క‌రీష్మా ప్ర‌కాశ్ ఇంట్లో సోదాలు జ‌ర‌ప‌గా, భారీ ఎత్తున మాద‌క ద్ర‌వ్యాలు దొరికాయి. దీంతో ఆమెకు మ‌రోసారి స‌మ‌న్లు జారీ చేశారు. ఈ మేర‌కు క‌రీష్మా కొద్ది సేప‌టి క్రితం ఎన్సీబీ ముందు హాజ‌రైంది. ప‌లు కోణాల‌లో ఆమెను అధికారులు విచారించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.  ఈ కేసులో కరిష్మా ప్రకాష్ పై ఎన్సీబీ ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది.