సోమవారం 25 మే 2020
Cinema - Apr 06, 2020 , 12:15:14

బ‌డా నిర్మాత కూతురికి సోకిన క‌రోనా..!

బ‌డా నిర్మాత కూతురికి సోకిన క‌రోనా..!

సామాన్యుడు, సెల‌బ్రిటీ అనే త‌ర‌త‌మ బేధం లేకుండా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌తి ఒక్క‌రిని ప‌ట్టి పీడిస్తుంది. దేశ ప్ర‌ధానుల నుండి దారినే పోయే దాన‌య్య‌లు కూడా క‌రోనాకి బ‌లి అవుతున్నారు. తాజాగా  బాలీవుడ్ కు చెందిన స్టార్ ప్రొడ్యూసర్ కరీం మొరాని కుమార్తె షాజా మొరాని కూడా  కరోనా బారిన పడడం కలకలం రేపింది. 

షాజా మొరాని ఇటీవ‌లే ఆస్ట్రేలియా నుంచి ముంబైకి వచ్చారు. ఇటీవ‌లే ఆమె జ్వరం, దగ్గు,జలుబుతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ నేప‌థ్యంలో  ఆమెకు వైద్య పరీక్షలు చేయగా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె కుటుంబ స‌భ్యుల‌ని కూడా క్వారంటైన్‌కి త‌ర‌లించిన‌ట్టు తెలుస్తుంది. అయితే షాజా మొరాని భార‌త్‌కి వ‌చ్చే ముందు  త‌న ప్రియుడు ప్రియాంక్ శ‌ర్మ‌తో ఆస్ట్రేలియాలో చ‌క్క‌ర్లు కొట్టింది. ఇప్పుడు షాజాకి క‌రోనా క‌న్‌ఫాం కావ‌డంతో ప్రియాంక్‌కి కూడా క‌రోనా టెస్ట్‌లు చేయాల‌ని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే షాజా తండ్రి క‌రీం ..షారుఖ్ ఖాన్‌కి ద‌గ్గ‌ర స్నేహితుడు. చెన్నై ఎక్స్ ప్రెస్‌తో పాటు ప‌లు హిట్ సినిమాల‌ని ఆయ‌న నిర్మించారు.


logo