ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 19:49:35

బోటులో భయపడ్డ కరీనా..ఎలా పైకొచ్చిందంటే..? వీడియో

బోటులో భయపడ్డ కరీనా..ఎలా పైకొచ్చిందంటే..? వీడియో

బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ..తరచూ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తుంటుంది. ఈ భామ హీరోయిన్ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్స్ సమయంలో కరీనాకు చేదు అనుభవం ఎదురైంది. చిత్రయూనిట్ సభ్యులతో సముద్రంలోని బోటులో ఉన్న కరీనా పైకి వచ్చే సమయంలో చాలా భయపడింది. బోటు నుంచి పైకొచ్చేందుకు ప్రయత్నిస్తూనే..భయపడింది. 

ఓ వైపు అలల ధాటికి బోటు కదులుతోంది. మరోవైపు కరీనాను పైకి తీసుకునేందుకు కొంతమంది తమ చేతులనందించారు. కొద్దిసేపటి తర్వాత అందరి సాయంతో కరీనా సురక్షితంగా పైకి వచ్చింది. కరీనా అభిమాని పోస్ట్ చేసిన పాత వీడియో ఇపుడు చక్కర్లు కొడుతోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo