బుధవారం 05 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 11:52:04

స‌రోజ్ ఖాన్ ఎక్స్‌ప్రెష‌న్స్ బాత్‌రూంలో ప్రాక్టీస్ చేసేదాన్ని: క‌రీనా

స‌రోజ్ ఖాన్ ఎక్స్‌ప్రెష‌న్స్ బాత్‌రూంలో ప్రాక్టీస్ చేసేదాన్ని: క‌రీనా

ఈ రోజు తెల్ల‌వారుజామున ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్  స‌రోజ్ ఖాన్ గుండెపోటుతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆమె మ‌ర‌ణ వార్త ప్ర‌తి ఒక్క‌రికి షాక్ ఇచ్చింది. గ‌తంలో ఆమెకి సంబంధించిన జ్ఞాప‌కాలని నెమ‌రువేసుకుంటున్నారు. బెబో క‌రీనా స‌రోజ్ ఖాన్ నుండి తాను ఎంత‌గా నేర్చుకున్న‌దో, ఆమె నుండి ఎలాంటి స‌ల‌హాలు స్వీక‌రించిందో వివ‌రించింది.

మాస్ట‌ర్ జీ .. నాకు ఎప్పుడు ఓ విష‌యం చెబుతూ ఉండేవారు.  చేతులు, కాళ్ళు కదల్చలేకపోతే  మీ ముఖంతో డ్యాన్స్ చేయాల్సిన అవసరం ఉందని అనేవారు. డ్యాన్స్  చేసేప్పుడు ఆమెని నిశితంగా గ‌మ‌నించేదాన్ని. ప్ర‌తి హీరోయిన్ కూడా ఈ రోజు టాప్‌లో ఉండానికి కార‌ణం మాస్ట‌ర్ జీ వ‌ల్ల‌నే. అప్పుడ‌ప్పుడు నేను బాత్‌రూంలో మాస్ట‌ర్ జీ ఎక్స్‌ప్రెష‌న్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. నేను న‌టిగా ఉండాలంటే మాస్ట‌ర్ జీ పాట‌ల‌ని మాత్ర‌మే చూడాలి. ఆమె క్లోజ‌ప్‌ల‌ని బాగా గ‌మ‌నించాలి అని నా తల్లి చెప్పేది అంటూ క‌రీనా వ్యాఖ్యానించింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo