ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 14, 2020 , 14:01:06

బ్యాక్ టూ వ‌ర్క్ అంటున్న క‌రీనా క‌పూర్

బ్యాక్ టూ వ‌ర్క్ అంటున్న క‌రీనా క‌పూర్

క‌రోనా ఎఫెక్ట్ కాస్త త‌గ్గ‌డంతో బాలీవుడ్ సెల‌బ్రిటీలు ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే అక్ష‌య్ కుమార్, అమీర్ ఖాన్‌లు విదేశాల‌లో షూటింగ్ మొద‌లు పెట్ట‌గా, రీసెంట్‌గా ర‌ణ్‌భీర్ క‌పూర్ ఇండియాలో త‌న తాజా చిత్ర షూటింగ్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ బెబో క‌రీనా క‌పూర్ కూడా తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయింది. ఈ విష‌యాన్ని ఆమె టీమ్ మెంబ‌ర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చింది.

క‌రీనా క‌పూర్‌తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ..బ్యాక్ విత్ మై టీమ్.. కొన్నాళ్లుగా ఇది మిస్ అయ్యాం అంటూ రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఆగ‌స్ట్ 12న సైఫ్‌, క‌రీనా దంప‌తులు త్వ‌ర‌లో మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మా కుటుంబంలోకి మరో వ్యక్తి చేరబోతున్నారని ప్రకటించడానికి మేం ఎంతో సంతోషిస్తున్నాం. మాపై ఎంతో ప్రేమ చూపిస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తోన్న శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతలు అని వ్యాఖ్యానించారు. మ‌రో బేబీకు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన త‌ర్వాతి రోజే క‌రీనా ఇలా ద‌ర్శ‌న‌మివ్వ‌డం ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా చేసింది. 


 


logo