శనివారం 26 సెప్టెంబర్ 2020
Cinema - Aug 13, 2020 , 10:02:48

రెండో బేబికి జ‌న్మ‌నివ్వ‌బోతున్న క‌రీనా..!

రెండో బేబికి జ‌న్మ‌నివ్వ‌బోతున్న క‌రీనా..!

బాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ సైఫ్ అలీఖాన్, క‌రీనా క‌పూర్ జంట త‌మ అభిమానుల‌కి గుడ్ న్యూస్ అందించారు. త్వ‌ర‌లో త‌మ ఇంట్లోకి మ‌రో బేబి రానుంద‌ని ప్ర‌క‌టించారు. మా కుటుంబంలోకి మరో వ్యక్తి చేరబోతున్నారని ప్రకటించడానికి మేం ఎంతో సంతోషిస్తున్నాం. మాపై ఎంతో ప్రేమ చూపిస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తోన్న శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతలు - సైఫ్ అండ్ కరీనా’’ అని ప్రకటనలో పేర్కొన్నారు. 

కరీనా కపూర్‌ను సైఫ్ అలీ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మొదటి భార్య అమృతా సింగ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కరీనాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సైఫ్ అలీ ఖాన్. సైఫ్‌, క‌రీనా దంప‌తుల‌కి తైమూ్ అనే కుమారుడు ఉండ‌గా, ఈ బుడ‌తుడు సోష‌ల్ మీడియాలో ఫుల్ ఫేమ‌స్. ఇక సైఫ్‌- అమృతా సింగ్‌ల‌కు సారా అలీ ఖాన్ అనే కుమార్తె ఉండగా, ఆమె బ‌ర్త్‌డే రోజు( ఆగ‌స్ట్ 12) క‌రీనా కపూర్ గ‌ర్భ‌వ‌తి అనే విష‌యం ప్ర‌క‌టించ‌డం విశేషం . క‌రీనా,సైఫ్‌ల‌కి ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు అంద‌జేస్తున్నారు.


logo