ఆదివారం 05 జూలై 2020
Cinema - May 27, 2020 , 15:10:56

ఆ పదానికి అర్థమేంటి అంటోన్న కరీనా..వీడియో వైరల్‌

ఆ పదానికి అర్థమేంటి అంటోన్న కరీనా..వీడియో వైరల్‌

దబాంగ్‌ 2లో అందాల తార కరీనాకపూర్‌ చేసిన స్పెషల్‌ సాంగ్‌ ఎంత పాపులర్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెవికాల్‌ సే అంటూ సాగే మాస్‌ సాంగ్‌లో కరీనా, సల్మాన్‌ కలిసి వేసిన స్టెప్పులు థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించాయి. ఈ సినిమా విడుదలై 8 ఏండ్లు అవుతోంది.

అయితే ఈ పాట షూటింగ్‌ కొనసాగుతున్నపుడు లొకేషన్‌లో కరీనా లిరిక్స్‌ను అన్వయించింది. ఆ తర్వాత పాటలో వచ్చే పాట్రోల్‌ సే పదానికి అర్థమేంటనీ అక్కడున్న వారిని అడుగుతోంది. లొకేషన్‌లో తీసిన అప్పటి వీడియో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తన ఓరచూపులతో అందరినీ మెస్మరైజ్‌ చేస్తూ..కరీనా వాట్‌ ఈజ్‌ ద మీనింగ్‌ ఆఫ్‌ దట్‌ అంటూ అడుగుతున్న చిన్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo