శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 11:43:32

క‌ళ్యాణి బిగ్ బాంబ్‌తో డైల‌మాలో ప‌డ్డ దేవి నాగ‌వ‌ల్లి..!

క‌ళ్యాణి బిగ్ బాంబ్‌తో డైల‌మాలో ప‌డ్డ దేవి నాగ‌వ‌ల్లి..!

రెండో వారం హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన క‌రాటే క‌ళ్యాణి వేదిక‌పైకి వ‌చ్చి రెండు వారాల జ‌ర్నీని చూసి తెగ సంతోషించింది. ఇలాంటి అరుదైన అవ‌కాశం ఒక‌సారే వ‌స్తుంద‌ని, నేను నా లాగే హౌజ్‌లో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది క‌ళ్యాణి. అసలు మొదటి వారమే వచ్చేస్తానని ఇంట్లో ముందుగానే చెప్పేశాను. కాని రెండో వారం వరకు ఉండటం భగవంతుడి దయ అనుకుంటానని కళ్యాణి వెల్లడించారు.

ఆ త‌ర్వాత ఇంటి స‌భ్యులకు ర్యాంకింగ్స్ ఇవ్వాల‌ని నాగార్జున ..క‌ళ్యాణికి టాస్క్ ఇచ్చారు. ఇందులో ఒక బోర్డుపై టాప్-5, బాటమ్-5 బ్లాక్‌లు ఇచ్చారు. ఆ బ్లాక్స్‌లో కంటెస్టెంట్స్ ఫోటోలు పెట్టి అందుకు కార‌ణం వివ‌రించాల‌ని పేర్కొన్నారు. రంగంలోకి దిగిన క‌ళ్యాణి ముందుగా బాటమ్-5లో సోహైల్ (5), సుజాత (4), అరియానా గ్లోరీ (3), కుమార్ సాయి (2), గంగవ్వ (1) ఫొటోలను కళ్యాణి అమర్చారు. అందుకు కార‌ణాలు కూడా వివ‌రించింది క‌ళ్యాణి

ఇక ఇక టాప్ - 5లో దేత్తడి హారిక (1), ‘అమ్మ’ రాజశేఖర్ (2), మోనాల్ (3), దివి (4), అభిజిత్ (5) ఫొటోలను కళ్యాణి పెట్టారు. అయితే అంద‌రి గురించి మంచిగానే మాట్లాడిన క‌ళ్యాణి.. సుజాత న‌వ్వు త‌న‌కు స్వ‌చ్చంగా అనిపించ‌ద‌ని చెప్పి వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న విబేదాల‌ని మ‌రోసారి బ‌హిర్గ‌తం చేసింది. ఆ త‌ర్వాత హ‌రిక‌థ‌ను త‌న‌దైన స్టైల్‌లో చెప్పిన క‌ళ్యాణి అంద‌రి చేత వావ్ అనిపించుకుంది. వెళ్ళే ముందు దేవిపై బిగ్ బాంబ్ వేసి ఆమెని డైల‌మాలో ప‌డేలా చేసింది.