శనివారం 30 మే 2020
Cinema - Apr 25, 2020 , 19:40:00

ప్రియాంక‌పై ప్రెష‌ర్ కుక్క‌ర్ లా మాట‌లు పేల్చాడ‌ట‌..!

ప్రియాంక‌పై ప్రెష‌ర్ కుక్క‌ర్ లా మాట‌లు పేల్చాడ‌ట‌..!

బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా, ద‌ర్శ‌క‌నిర్మాత  క‌ర‌ణ్ జోహార్ మంచి స్నేహితులనే విష‌యం తెలిసిందే. అయితే ఓ సంద‌ర్భంలో ప్రియాంక చోప్రాను క‌ర‌ణ్ జోహార్  వెన్నెముక లేని వ్యక్తి అంటూ..ఓ ప్రెష‌ర్ కుక్క‌ర్ పేలిన‌ట్లు మాటల తూటాలు పేల్చాడ‌ట‌. అయితే ఆ మాట‌లు క‌ర‌ణ్ జోహార్ త‌న‌కు తానే స్వ‌యంగా అన్నాడా..? లేదా  అని తెలియాల్సి ఉంద‌ని ముంబై మిర్ర‌ర్ ఓ క‌థ‌నంలో పేర్కొంది. 

నేను ప్రియాంక‌కు ఫోన్ చేసి ప్రెష‌ర్ కుక్క‌ర్ పేలిన‌ట్లు స్పందించాను. అయితే అలా చేయ‌డం స‌రైంది కాద‌ని గ్ర‌హించాను. ప్రియాంక‌తో నాకు మంచి బావోద్వేగ‌పూరిత అనుబంధం ఉంది. నేను ప్రియాంక‌తో ఎన్నో మ‌ధుర‌మైన క్ష‌ణాలను పంచుకున్నా. ప్రియాంక క‌న్నా పెద్ద వాడిని కాబ‌ట్టి..నేను ఇంకా ప‌రిణ‌తి చెందాల్సి ఉంద‌ని క‌ర‌ణ్ జోహార్ చెప్పాడ‌ట‌. అయితే ఈ కామెంట్స్‌పై ప్రియాంక చోప్రా స్పందించక‌పోవ‌డం గ‌మ‌నార్హం.  


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo