శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 24, 2021 , 16:22:09

వ‌రుణ్‌ధ‌వ‌న్ వెడ్డింగ్‌కు వ‌స్తున్న తార‌‌లు..ఫొటోలు,వీడియో

వ‌రుణ్‌ధ‌వ‌న్ వెడ్డింగ్‌కు వ‌స్తున్న తార‌‌లు..ఫొటోలు,వీడియో

బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్ -న‌టాషాద‌లాల్ వివాహ వేడ‌కకు అంతా సిద్ద‌మైంది. అలీబాగ్‌లోని మాన్ష‌న్ హౌజ్‌లో వెడ్డింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ రాత్రి వివాహం జ‌రుగనుండ‌గా..మాన్ష‌న్ హౌజ్‌కు ప‌లువురు సెల‌బ్రిటీలు వ‌స్తున్నారు. క‌ర‌ణ్ జోహార్ మాన్ష‌న్ హౌజ్ వ‌ద్ద కారులో నుంచి దిగుతున్న స్టిల్స్, ప్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీశ్ మ‌ల్హోత్రా ఫొటో వైర‌ల్ అవుతున్నాయి. వ‌రుణ్‌ధావ‌న్‌, న‌టాషాల కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులు, కొద్దిమంది ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో పెండ్లి జ‌రుగ‌నుంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం వెడ్డింగ్‌కు కేవ‌లం 50 మంది అతిథుల‌ను మాత్ర‌మే ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది. వరుణ్ ఇండ‌స్ట్రీ స్నేహితులు అలియాభ‌ట్‌, అర్జున్ క‌పూర్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తోపాటు ప‌లువురు న‌టీన‌టులు ఈ వేడుక‌కు హాజ‌రుకానున్నారు. శ‌నివారం మెహిందీ స‌ర్మ‌నీతోపాటు డీజే బోస్కో సార‌థ్యంలో డిజే నైట్ ఈవెంట్స్ గ్రాండ్‌గా జ‌రిగాయి. వెడ్డింగ్ ప్లేస్ నుంచి లీకైన ఫొటోలు. వీడియోలు ఇపుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వ‌రుణ్‌ధ‌వ‌న్ సంప్ర‌దాయ ఘోడీ డ్రెస్‌లో క్వాడ్ బైక్‌పై పెండ్లి మండ‌పం వ‌ద్ద‌కు రానున్నాడ‌ట‌. సెక్యూరిటీ టీం క్వాడ్ బైకును లోపలికి తీసుకెళ్తున్న వీడియో కూడా వైర‌ల్ అవుతున్న‌ది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo