అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మంథాన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా మైత్రి మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 13న మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తుండగా, బుధవారం రోజు బన్నీ బర్త్‌డే సందర్భంగా టీజర్ విడుదల చేశారు.
పుష్పరాజ్‌గా టీజర్లో అదరగొట్టేశాడు బన్నీ. ఇది చూసిన ప్రతి ఒక్కరు బన్నీ ఇక తగ్గేదే లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం తన ట్విట్టర్ ద్వారా బన్నీకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పుష్ప టీజర్ చూసాను. చాలా రియలిస్టిక్, రస్టిక్‌గా ఉంది. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ తగ్గేదే లే అంటూ కామెంట్ పెట్టారు. పుష్ప టీజర్ జెట్ స్పీడ్‌తో వ్యూస్, లైక్స్ సాధిస్తుండగా, ఇప్పటికే 5 లక్షలు లైక్స్ క్రాస్ అయ్యిపోయిన ఈ టీజర్ సరికొత్త రికార్డ్ సాధించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.