మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 09, 2020 , 17:41:25

మ‌ళ్లీ అడ్డంగా బుక్క‌యిన క‌ర‌ణ్ జోహార్..!

మ‌ళ్లీ అడ్డంగా బుక్క‌యిన క‌ర‌ణ్ జోహార్..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య  త‌ర్వాత నెపోటిజం అనే ప‌దం బాగా వార్త‌ల‌లో నానుతూ వ‌స్తుంది. నెటిజ‌న్స్ నెపోటిజం పేరుతో ప‌లువురు న‌టీన‌టుల‌ని ఎండ‌గ‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌ర‌ణ్ జోహార్ పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. దీంతో ఆయ‌న బాగా కుంగిపోయారని రీసెంట్‌గా అత‌ని స‌న్నిహితులు తెలిపారు. 


సుశాంత్ మరణానికి కారకుడిగా తనని నిందిస్తున్న వారి వ్యాఖ్యలు కరణ్ చేత కంట తడి పెట్టించాయట. కరణ్ లాయర్ ప్రస్తుతం సుశాంత్ మరణం గురించి మాట్లాడకపోతేనే మంచిది అని చెప్పారట. దానితో పాటు కరణ్ ప్రస్తుతం ఏమి మాట్లాడే స్థితిలో లేరని కరణ్ సన్నిహితులు తెలియజేశారు. అయితే క‌ర‌ణ్ చాలా బాధలో ఉన్నాడ‌ని చెప్పిన కొద్ది గంట‌ల‌లోనే నీతూ క‌పూర్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌లో ఉత్సాహంగా క‌నిపించారు. దీంతో మరోసారి ఆయ‌ని నెటిజ‌న్స్ ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo