మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 11:13:38

ఇద్ద‌రు యువ హీరోల‌తో మ‌ల‌యాళ చిత్రం రీమేక్..!

ఇద్ద‌రు యువ హీరోల‌తో మ‌ల‌యాళ చిత్రం రీమేక్..!

ఇండ‌స్ట్రీలో రీమేక్‌ల హ‌వా న‌డుస్తుంది. తెలుగు చిత్రాలు వివిధ భాష‌ల‌లో రీమేక్ అవుతుండ‌గా, వేరే భాష‌ల‌లో హిట్టైన సినిమాల‌ని తెలుగులోకి అనువ‌దిస్తున్నారు. తాజాగా మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ సాధించిన క‌ప్పెలా చిత్రం టాలీవుడ్‌లో రీమేక్ కానుంది. సితార ఎంట‌ర్‌టైన్‌ముఎంట్స్ ఈ చిత్రం రీమేక్ హ‌క్కుల‌ని ద‌క్కించుకోగా, మూవీని ఇద్ద‌రు హీరోల‌తో తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం.

యువ ద‌ర్శ‌కుడు క‌ప్పెలా రీమేక్‌ని తెర‌కెక్కించ‌నుండ‌గా, త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు. ఇటీవ‌ల పెళ్లి చూపులు ద‌ర్శ‌కుడు త‌రుణ్ ద‌ర్శ‌కుడు క‌ప్పెలా చిత్రాన్ని వీక్షించ‌గా, దాని  రివ్యూని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ నేప‌థ్యంలో త‌మ అభిమాన హీరోని కించ‌ప‌రిచేలా త‌రుణ్ పోస్ట్ పెట్టాడ‌ని భావించిన ఫ్యాన్స్ త‌రుణ్‌పై విప‌రీతంగా ట్రోల్ చేయ‌డంతో కేసు కూడా పెట్టిన విష‌యం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo