మంగళవారం 26 మే 2020
Cinema - May 22, 2020 , 13:52:14

క్ష‌మాప‌ణ‌లు చెప్పిన క‌పిల్ శ‌ర్మ‌

క్ష‌మాప‌ణ‌లు చెప్పిన క‌పిల్ శ‌ర్మ‌

క‌మెడీయ‌న్ క‌పిల్ శ‌ర్మ పాపుల‌ర్ షో ది క‌పిల్ శ‌ర్మ అనే కార్య‌క్ర‌మంతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక్కోసారి కామెడీ కోసం మాట జారి ప‌లు వివాదాల‌లోను ఇరుక్కుంటాడు క‌పిల్‌. తాజాగా ఆయ‌న కొందరి మ‌నోభావాలు దెబ్బతీసేలా మాట్లాడ‌గా, వారు ఆయ‌నపై కేసు పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క త‌ప్ప‌లేదు.

వివ‌రాల‌లోకి వెళితే క‌పిల్ శ‌ర్మ మార్చి 28న ప్ర‌సార‌మైన ది క‌పిల్ శ‌ర్మ షోలో చిత్ర గుప్తుడి అప‌హాస్యం చేస్తూ మాట్లాడారు. తమ ఆరాధ్య దైవమైన చిత్రగుప్తుడి గొప్పతనాన్ని క‌పిల్ త‌క్కువ‌గా చేశాడంటూ కాయస్థ సామాజిక వర్గం మండి ప‌డింది. అంతేకాదు ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కూడా డిమాండ్ చేసింది. లేని పక్షంలో కపిల్‌ శర్మను బాయ్‌కాట్‌ చేయడంతో పాటుగా.. అతడిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేస్తామని హెచ్చరించారు.  

ఈ నేప‌థ్యంలో త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన క‌పిల్ .. ‘‘ప్రియమైన కాయస్థ సమాజానికి నమస్కారం. మే 28న ప్ర‌సార‌మైన ది క‌పిల్ షో కార్య‌క్ర‌మంలో చిత్రగుప్తుడిపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతున్నా. ఎవ‌రి మనోభావాలను కించపరిచే ఉద్దేశం మాకు లేదు. అంద‌రు ఎల్లప్పుడూ సంతోషంగా, క్షేమంగా నవ్వుతూ ఉండాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నా. హృదయపూర్వక నమస్కారాలు’’అని కపిల్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో వివాదం స‌ద్దుమ‌ణిగిన‌ట్టే అని అనిపిస్తుంది. 


logo