గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 00:17:16

కనులతో రచించు పాట

కనులతో రచించు పాట

‘హుషారు’ ఫేమ్‌ దినేష్‌తేజ్‌ హీరోగా, శ్వేతా అవస్తి హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం ‘మెరిసే మెరిసే’. పవన్‌కుమార్‌ దర్శకత్వంలో వెంకటేష్‌ కొత్తూరి నిర్మిస్తోన్న ఈ చిత్రంలోని శ్రేష్ట్‌ రచించిన ‘కనులతో రచించు’ పాటని హీరో శ్రీ విష్ణు విడుదల చేశారు. కార్తీక్‌ కొడగండ్ల సంగీతాన్ని అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘లవ్‌, కామెడీ, ఎమోషన్‌ ఇలా అన్నిఅంశాలు సమపాళ్లలో మేళవించి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ‘కనులతో రచించు’ అనే పాట విజువల్‌గా కూడా కొత్తగా చిత్రీకరించాం. యూత్‌ అందరికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’ అన్నారు. సంజయ్‌ స్వరూప్‌, గురురాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నగేష్‌ బన్నెల్‌.